సీటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించిన సింగరేణి ఛెర్మన్‌

గోదావరిఖని: సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన సీటీస్కాన్‌ను ఛైర్మన్‌ సుతీర్ధ భట్టాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు త్వరలోనే ఎంఆర్‌ఐ స్కాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం సింగరేణి వ్యాపంగా మూడు సంజీవిని అధునాతన అంబులెన్స్‌లను ఏర్పాటుచేశామని ప్రత్యేక వైద్యులను నియమిస్తామన్నారు. కొత్తప్రాజెక్టుల అటవీశాఖ అనుమతి లభించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ విజయకుమార్‌, అపరేషన్‌.ప్రాజెక్టు సంచాలకులు రమేష్‌కుమార్‌, మనోహరరావు చీఫ్‌ మెడికల్‌ అధికారి ప్రసన్న సింహ… తదితరులు
పాల్గొన్నారు.