సీతానగరం వంతెనకు మోక్షం లభించేనా?

నిధులు విడుదలయినా మొదలు కాని పనులు

విజయనగరం,నవంబర్‌11(జనం సాక్షి):

జిల్లాలో చాలా రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్డు ప్రయాణమంటే అధికారులు కూడా భయపడిపోతున్నారు. అడుగడుగునా గుంతలతో వాహనాలపై ప్రయాణించాలంటే కష్టతరంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.  గతంలోనే అధికారులు  సీతానగరం వంతెనను, కూనేరు రహదారిని పరిశీలించి వెళ్లిపోయారు. సీతానగరం వంతెన మరమ్మతులకు, కూనేరు రహదారికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించి వెళ్లిపోయారు. సీతానగరం వంతెన నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 11 కోట్లు మంజూరయ్యాయని అప్పట్లో  ఉన్నతాధికారులు ప్రకటించారు. వంతంలో వంతెన నిర్మాణానికి మంజూరైన నిధులతో ఎందుకు పనులు ప్రారంభించలేదన్న విషయాన్ని ప్రజలకు ఇంజినీరింగ్‌ అధికారులు వివరించాల్సి ఉంది. సీతానగరం వంతెనతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.  బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ స్థితిలో ప్రత్యామ్నాయంగా మూడేళ్ల కిందటే ఈ వంతెన నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. దీనిపై ప్రజలు, సీపీఎం నాయకులు పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ రహదారులను పరిశీ లించి ప్రతిపాదనలను పంపించా మన్నారే తప్ప సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రా తిపదికపై విధంగా కూనేరు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై ఈప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.