సీపీఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే

ఏలూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానం రద్దుకోరుతూ తీర్మానించినట్లు యూటీఎఫ్‌ జిల్లా నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు త్వరగా అమలుచేయాలని, పండిత, పీఈటీ కొలువులను వర్గోన్నతిచేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర

పనులను ఉపయోగించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని కోరుతూ ఇటీవల చలో అసెంబ్లీ నిర్వహించామని

తెలిపారు. 2004 సంవత్సరం తర్వాత ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానం అమలు చేయడంవల్ల ఆర్థికంగా నష్టపోతున్నా రన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.