సీపీఐ రెకొండ గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా బోయిని పటేల్ ఎన్నిక
జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 14:
భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మండలంలోని రెకొండ గ్రామ శాఖ కార్యదర్శి గా బోయిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను,మండల కొమురయ్య లను ఎన్నుకున్నట్లు సీపీఐ జిల్లా నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఆదివారం రెకొండ గ్రామ శాఖ సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు సన్నద్ధం కావాలని,ప్రజా సమస్యలపై సీపీఐ గా పోరాటాలు నిర్వహించాలని,అదే విధంగా కమ్యూనిస్ట్ కంచుకోట ఆయిన చిగురుమామిడిలో కమ్యూనిస్ట్ పార్టీ గా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టలని ఆయన పిలుపునిచ్చారు.. అనంతరం నూతన కమిటీ లను ఎన్నుకున్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తమ్మిశెట్టి రవీందర్,దుడ్డేల సధనందం,తమ్మిశెట్టి ప్రవీణ్,బోయిని పరకాల కొండయ్య సంజీవ్,విలసాగరం అంజయ్య, మొగిలి ఓదెలు,దుడ్డేల సమ్మయ్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కొంకటి ప్రశాంత్,చెంచాల రవి, బోయిని రాజు, జిల్లెల పర్షరాములు తదితరులు పాల్గొన్నారు..