సీబీఐ చార్జీషీట్ ప్రకారం ధర్మానపై విచారణ జరిపించాలి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
సంగారెడ్డి, నవంబర్ 26 ( అవినీతి మంత్రి ధర్మానపై సీబీఐ ఛార్జీషీట్‌లో పేర్కొన్నట్టు విచారణ సమగ్రంగా జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆకుల లింగాపూర్ గ్రామంలో మీ కోసం పాదయాత్రలో భాగంగా సోమవారం అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 9 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతూ చట్టాన్ని అధీనంలోకి తీసుకుంటామని అనడం సరైనది కాదని అన్నారు. సామాన్యుడైన మంత్రి అయిన నేరం రుజువు ఇద్దరికీ శిక్ష ఓకే విధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. తను మోకాళ్లపై నిడిచినా ప్రజలు విశ్వసించరని కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై బాబు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగాను, రాష్ట్రంలోను మంత్రిగా ఉన్న కేసీఆర్ ఆ నాడు ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆయన కుటుంబంలోని అల్లుడు, కుతురు, కొడుకే ఉపాధి కల్పించారని అన్నారు. బీడీ కార్మికులకు ఆయన వర్గబెట్టీందేమీ లేదని అన్నారు. అంకే కాక బీడీ కట్టపై పుర్రె గుర్తు, ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని బాబు విమర్శించారు. సామాజిక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి పీఆర్పీ ఏర్పాటు చేసి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్‌లో కల్పించిన చిరంజీవి ప్రజలకు ఏమీ చేశాడని అన్నారు. ప్రజల సమస్యలను కాంగ్రెస్ పాలకులు ఏమాత్రం పట్టించుకోడం లేదని, ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. తాను అధికారంలోకి వస్తే వెంటనే రైతుల రుణమాఫిని అమలులోకి తెస్తానని మొదటి సంతకం దానిపైనే చేస్తానని అన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం ప్రవేశపెట్టి ప్రజలకు మంచి నీటిని అందిస్తానని అన్నారు. గిరిజనులకు, వికలాంగులకు నేత కార్మికులకు ఆదుకుంటామని అన్నారు. లక్ష 50 వేల ఇళ్లను నిర్మించి ఉచితంగా అందిస్తామని బాబు హామీ ఇచ్చారు. బాబు పాదయాత్ర నారాయణఖేడ్ నుండి వెంకటాపూర్, హనుమంతరావుపేట మీదగా సోమవారం రాత్రికి పెద్ద శంకరం పేట చేరుకుంటుంది. ఈయన పాదయాత్రలో బాబుమోహన్, గంగాధర్, విజయపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.