సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో చుక్కెదురు
ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్ నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్
మీరు చెప్పింది విన్నాను వెళ్లండి : షిండే
న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) :
సమైక్య వాదం వినిపిం చేందుకు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలకు చేదు అనుభవం ఎదురైంది. అధిష్టానంపై ఒత్తిడి తెద్దామ నుకున్న నేతలకు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల పరిశీలకుడు వాయలర్ రవి సీమాంధ్ర నేతలతో భేటీని అర్ధంతరంగా ముగించేశారు. వారు చెప్పే దేమీ వినకుండానే నాకు పని ఉంది.. అసలు ఇప్పుడెం దుకొ చ్చారని ప్రశ్నిస్తూ వెళ్లిపో యారు. ఇక, కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు కలిసిన సీమాంధ్ర నేతలకు షాక్ తగిలింది. రాష్ట్ర విభజనపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఎప్పుడో చెప్పేశామని దిగ్విజయ్ స్పష్టం చేయడంతో దిమ్మ తిరిగినంత పనైంది. అసలు నేను పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిని కాదుకదా అని అడిగారు. దీంతో ఏం చేయాలో తోచక తమ వెంట తెచ్చుకున్న లేఖను ఆయన సమర్పించిన నేతలు నిరాశగా వెనుదిరిగారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు సీమాంధ్రకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం ఉదయం ఢిల్లీలో అడుగు పెట్టారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్, శైలజానాథ్, తోట నరసింహం, విశ్వరూప్, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, శేషారెడ్డి తదితరులు ఢిల్లీలో హైకమాండ్ నేతలను కలిసేందుకు వచ్చారు. తనను కలిసేందుకు వాయలర్ రవి ఉదయం 11 గంటలకు వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే, అరగంట ఆలస్యంగా సీమాంధ్ర నేతలు వాయలర్ రవి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, వారితో భేటీ అయ్యేందుకు రవి నిరాకరించారు. మీరు ఆలస్యంగా వచ్చారని, ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు. తాను కేరళ పర్యటనకు బయల్దేరుతున్నారని, మరోసారి కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో నిస్పృహకు లోనైన సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని కోరగా… తాను రాష్ట్ర వ్యవహారాలను చూడడం లేదని స్పష్టం చేశారు. సమైక్య వాణి వినిపించేందుకు యత్నించాలని భావించిన నేతలకు ఊహించని రీతిలో దిగ్విజయ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే, రాష్టాన్న్రి సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేయగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన నిర్ణయాన్ని కేంద్ర ¬ం శాఖకు చెప్పేసిందన్నారు. త్వరలోనే కేంద్రం ఓ నిర్ణయం ప్రకటించనుందన్నారు. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం వెలువరిస్తామని ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై షిండేనే ప్రకటన చేస్తారని తెలిపారు. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో మరో నేత మోతిలాల్ వోరాతో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఓ మెమొరాండాన్ని అందజేశారు. వెనుకబడిన ప్రాంతాలకు అవసరమైతే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రాష్టాన్న్రి మాత్రం విభజించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్టాన్న్రి విభజిస్తే ఇతర రాష్టాల్ర డిమాండ్లు కూడా వెల్లువెత్తుతాయని వివరించారు. అయితే, వారు చెప్పిందంతా విన్న మోతిలాల్ వోరా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని, తామేవిూ చేయలేమని వ్యాఖ్యానించినట్లు సమాచారం. షిండేను కలిసి నిర్దిష్టమైన హామీ కోసం ప్రయత్నించిన నేతలు మరింత ఢీలా పడిపోయారు. మీరు చెప్పాల్సింది చెప్పారు.. ఇక వెళ్లండి అంటూ షిండే తేల్చిచెప్పారు. అయితే, హైకమాండ్ పెద్దలతో భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు విూడియాతో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలకు సమైక్య వాణిని వినిపించామన్నారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వినిపించామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. రాష్టాన్న్రి ఐక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉండి ఇతర నేతలను కలుస్తామన్నారు. సమైక్య రాష్టాన్న్రి ఉంచాలని, వేరే ఏ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత దృష్ట్యా రాష్టాన్న్రి విభజించవద్దని పెద్దలను కోరామన్నారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచి వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. అత్యవసర భేటీ ఉన్నందున వాయలర్ రవి రేపు కలుద్దామని చెప్పినట్లు తెలిపారు.