సీసీఐ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పత్తిరైతులు
వరంగల్ : పత్తి కొనుగోలు చేయకపోవడంతో ఎనుమాముల మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు సీసీఐ కార్యాలయ ఆద్దాలను పగలగొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.