సీ.ఎం.ఆర్.ఎఫ్.చెక్కుల పంపిణీ
భీమారం, (జనంసాక్షి): తెరాస పార్టి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూర్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు గురువారం భీమారం మండల కేంద్రం లోని తెరాస కార్యలయం నందు తెరాస పార్టీ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ అద్యక్షతన లబ్ది దారులైన దాడి సుదర్శన్, సుంకరి లక్ష్మి, భూక్యా పరుశురాం నాయక్, రామల్ల శంకర్ గార్లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమారం సర్పంచ్ గద్దె రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, చెన్నూర్ మార్కేట్ కమిటి డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఆకుదారి రాజన్న, నాయకులు రూప్ సింగ్ నాయక్, వడ్లకొండ పవన్ తదితరులు పాల్గొన్నారు