సుజనా మాల్ లో సందడి చేసిన కోహ్లీ
హైదరాబాద్: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నగరంలో సందడి చేశాడు. కూకట్పల్లి ఫోరం మాల్లో శుక్రవారం ఓ బట్టలషాపు ప్రారంభోత్సవానికి విచ్చేశాడు. తన సొంత బ్రాండ్ అయిన వ్రాగన్ దుస్తుల దుకాణాన్ని కోహ్లీ ప్రారంభించాడు. అభిమాన క్రికెటర్ రాకతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కాసేపు మీడియాతో ముచ్చడించాడు. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఇక్కడ హైదరాబాదీయులు చాలా ఫ్యాషన్బుల్ ఉంటారంటూ కితాబిచ్చాడు.