సుప్రీం ఆదేశాలతో నీలగిరి రిసార్టుల మూసివేత

చెన్నై,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సుప్రీం ఆదేశాలతో నీలగిరిలో రిసార్టులు మూతపడుతున్నాయి. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఏనుగుల కారిడార్‌లో రిసార్టులను మూసివేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని అడ్డుకునేలా రిసార్టుల నిర్మాణం చేపట్టడంపై దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల సుప్రీం ఫైర్‌ అయ్యింది. అక్కడ ఇరవై ఏడు రిసార్టులను మూసివేసే పక్రియ ఆరంభించి వాటిలో 19 రిసార్టులను రాత్రి సీల్‌ చేశారు. మరో 12 రిసార్టులను మూసివేతకు సంబందించి వారి వివరణ కోరారు. సుప్రింకోర్టు ఈ రిసార్టులను నలభై ఎనిమిది గంటలలో మూసివేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.ఈ రిసార్టులు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారని అదికారులు దృవీకరించారు.ఈ రిసార్టుల వల్ల ఏనుగుల జీవనానికి ఆటంకం అని కోర్టు అబిప్రాయపడింది. ఏనుగులు జాతీయ హెరిటేజ్‌ అని కోర్టు వ్యాఖ్యానించింది.దానిని పరిరక్షించుకోవాలని అబిప్రాయపడింది.

——