సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో –ఒకే రోజు నాలుగు సుఖ ప్రసవాలు

 

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య సమయంలో నాలుగు సురక్షితమైన ప్రసవాలు జరిగినట్లు వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ కాన్పులన్నీ కూడా ప్రసవించిన నలుగురు మొదటి కాన్పులు అని వారుతెలిపారు. ముత్యాలపాడు క్రాస్ రోడ్డు కి చెందిన బానోతు మౌనిక మగపిల్లాడికి, మురుట్ల గ్రామానికి చెందిన కుంజా రేణుక మగ పిల్లవాడికి,టేకులపల్లికి చెందిన జోగా అశ్విని పాపకు,తడికలపూడి కి చెందిన బానోతు నందిని పాపకు జన్మనిచ్చారు. అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సురక్షితమైన కాన్పులు చేయడానికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారని వైద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. వీరందరికీ కేసిఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ సత్యవతి, శకుంతల,స్టాప్ నర్సులు సునీత, వేదమణి,లలిత, ఆయమ్మలు పద్మ, కళమ్మ పాల్గొన్నారు.