సుల్తానాబాద్‌లో కార్డన్‌సెర్చ్
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. శుక్రవారం వేకువజామున జరిపిన తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీదిగ్బంధం చేసి, ఇంటింటినీ సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని 20 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు.
వంద లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దొంగతనాలు జరిగినా అనుమానితులు ఎవరైనా సంచరిస్తూ కనిపించినా వెంటనే సమాచారం అందించాలని కోరారు.