సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

డోర్నకల్/కురవి, సెప్టెంబర్ 26, జనం సాక్షి న్యూస్: చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని కురవి మండలం సూదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ధరావత్ వెంకన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దీర వనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి ,2022 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది . అందుకే సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతిని జరుపుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్, ఎస్.కె అశ్మత్ పాషా ,బి . విజయ్,. సురేష్ మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు