సూపర్ మూన్ ..!!!

సోమవారం xheviప్రపంచానికి కనువిందు చేసింది. అతిపెద్ద చంద్రుడు మనకు ఆవిష్కృతం కావడాన్ని సూపర్‌మూన్‌గా చెబుతున్నాం. ఈ ఏడాది మూడుసార్లు సూపర్‌మూన్ వచ్చింది. అయితే ఈ శతాబ్దంలోనే అత్యంత పెద్ద సూపర్‌మూన్ నవంబర్ 14న అందరికీ కనిపించి కనువిందు చేసింది. దాదాపు ప్రతి రెండు మూడేళ్లకోమారు సూపర్‌మూన్ కనిపిస్తున్నా, అతిపెద్దదిగా, భూమికి అతిదగ్గరగా వచ్చి కనువిందు చేసిన ఘటన ఇదే. ఇలాంటి ఘటనే మరోమారు 2018 జనవరిలో కూడా వస్తుందని చెబుతున్నారు. పరిమాణానికి 14 శాతం పెద్దదిగా, కాంతి తీవ్రతకు 30 శాతం అధికంగా సోమవారం నాటి సూపర్‌మూన్ కనిపించింది.