సూర్యచంద్రులున్నంత వరకూ టీడీపీ ఉంటుంది – రేవంత్‌

కరీంనగర్‌ ( మార్చి 3) : సూర్యచంద్రులు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కనే అమరులకు స్థూం పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తామని ఆయన అన్నారు. ల్యాండ్‌, శాండ్‌, మైనింగ్‌, వైన్‌ మాఫియాలన్నీ కేసీఆర్‌ కుటుంబంలోనే ఉన్నాయని రేంంత్‌రెడ్డి విమర్శించారు.