సూర్యాపేట టిఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 (: సూర్యాపేటలో జరగనున్న టిఆర్‌ఎస్‌ మహాసభకు కరీంనగర్‌ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో విస్తృతంగా సభలు, పల్లెబాటలు నిర్వహించాలని, వాటిని చూసైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు కనువిప్పుకలగవచ్చని దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి తెలపకుండా టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపిలు జరుపుతున్న పాదయాత్రలు తెలంగాణలోకి ప్రవేశించబోనిమ్మని, ఆ పార్టీల వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడే తెలంగాణలోకి అడుగుపెట్టవచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ సమావేశంలో రాంరెడ్డి, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.