సెంచరీతో దూసుకుపోతున్న ధావన్
హైదరాబాద్: బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. 101 బంతుల్లో 16 ఫోర్లు చేసి 102 పరుగులుచేశాడు. మరో వైపు మరో ఓపెనరల్ మురళీ విజయ్ సైతం అర్థ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. భోజన విరామానికి ముందు వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలకు పైగా ఆగిపోయింది. ప్రస్తుతం భారత స్కోరు 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసింది.