సెప్టెంబర్ నాటికి ద్రవ్యోల్భణం తగ్గుముఖం
చెన్నై: దేశంలో సాధారణ పౌరులు అకాశాన్నంటుతున్న ధరలతో మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర, ఆర్థిక ప్రధాన సలహాదారు కౌశిక్ బసు పేర్కొన్నారు. నగరంలో మంగళవారం సదరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆండ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు సెప్టెంబరు ఆఖరునాటికి ద్రవ్యోల్బణం ఏడు శాతం కంటే తగ్గుతుందని చెప్పారు. ఆక్టోబరు మధ్య కాలంలో తొలిసారిగా ఏడు శాతం కంటే తక్కువ ద్రవ్యోల్బణాన్ని చూడగలమని ఆశాభావాన్ని బసు వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న కఠినతరమైన ఈ పరిస్థితిని ఎదుర్కొవడానికి కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మే నెలలో కూరగాయలు, చమురు ధరలు గణనీయంగా పెరగటంతో ద్రవ్యోల్బణ పరిస్థితి 7.55శౄతంగా నమోదైందని తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకంటే మన దేశం పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని అభివర్ణించారు. ఇతర దేశాలలో కూడా కరెన్సీ విలువ తగ్గిపోయిందని తెలిపారు. ఆర్థిక మాంద్యంతో యూరవ్ దేశాలు సతమతమైపోతున్న పరిస్థితిని కీకల ప్రయోగంగా అభివర్ణిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు అందుబాటులో ఉన్న పలు అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని సూచించారు.