సెప్టెంబర్ 1 న నల్ల బ్యాడ్జీలతో నిరసన.

టీపీటీయు జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు31(జనంసాక్షి):

సిపిఎస్ రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరుతూ సెప్టెంబర్ 1 న ప్రభుత్వ ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టిపీటీయూ)జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపాలని జిల్లా టీపీటీయు అధ్యక్షులు సాయిరెడ్డి, ప్రచార కార్యదర్శి వీరేష్, పానుగంటి శేఖర్ లు పిలుపునిచ్చారు. 1981 పెన్షన్ రూల్స్ అమలు చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయటం సరికాదని అన్నారు.ఇప్పటి సిపిఎస్ ఉద్యోగాలు చేస్తూ పదవీ విరమణ తర్వాత వారికీ నెలకు కనీస వేతనంగా 450 రూపాయల నుంచి గరిష్టంగా 14600 రూపాయల వరకు మాత్రమే వస్తుందని ఆయన అన్నారు.ఉపాధి హామీ కూలీల కంటే తక్కువ రావడం బాధాకర మన్నారు. సిపిఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం పరిలోని అంశం అని, ఇప్పటికే చాలా రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.