సెప్టెంబర్ 9 నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె-జెఏసీ
టేకులపల్లి, ఆగస్టు 20( జనం సాక్షి): సెప్టెంబర్ 9 వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మె ను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు డి.ప్రసాద్,రేపాకుల శ్రీనివాస్,బానోత్ ఊక్లా,గుగులోత్ రాంచందర్ లు పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ కార్యాలయం లో గుగులోత్ రాంచందర్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనేక ధఫాలు చర్చలు జరిపినా యాజమాన్యం వేతనాలు పెంచడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమ తో కోట్ల రూపాయల లాభాలను పొందుతూ లాభాల్లో వాటా ఇవ్వటం లేదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులందరూ సమ్మె కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈసం నరసింహారావు,ఐత శ్రీరాములు,రత్నాచారి తదితరులు పాల్గొన్నారు.