“సెర్చ్” ఆపరేషన్

వెంకట్రాంపురం లో పోలీసులు కార్డన్ సెర్చ్
-100 మంది జిల్లా పోలిసుల విస్తృత తనిఖీలు
బయ్యారం,జూన్25
(జనంసాక్షి ):
మహబుబాబాద్ జిల్లా,
 బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ
 కార్బన్ సెర్చ్ లో 50వేల నగదు,30 లీటర్ల సారా, 200 లీటర్ల పానకం, 50 కేజీల బెల్లం స్వాదినం చేసుకున్నారు. అంతేకాకుండా నెంబర్ ప్లేట్ లేని, ఇతర ముఖ్యమైన డాకుమెంట్స్ లేని 30 బైకులు,1 ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు.గుడుంబా తయారీ చట్ట రీత్యా నేరం అని,అటువంటి కార్యక్రమంలో ఎవరు భాగస్వాములైనా ఉపేక్షించేది లేదని డీస్పీ సదయ్య అన్నారు.సారాయి సేవించడం ఆరోగ్యానికి హానికరమని,సారాయి వాళ్ళ ఎన్నో కుటుంబాలు చిన్నబిన్నమయ్యాయని, యువత మద్యం మత్తులో ఎన్నో అఘాత్యాలకు పాల్పడుతున్నారని ఈ సందర్బంగా అయన అన్నారు.అక్రమంగా మద్యం తరలింపులు, అక్రమ మద్యం అమ్మకాలు,ఇతర అక్రమ మత్తు పానియాలు ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.ఈ
కార్డెన్ సెర్చ్ లో డీస్పీ సదయ్య,బయ్యారం ఎస్సై రమాదేవి, జిల్లా పోలీసులు,కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.