సేంద్రియ ఎరువులు వాడితే అధిక దిగుబడి 

తూప్రాన్ (జనంసాక్షి )జూన్ 24::  రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ జీవ ఎరువులను వాడితే అధిక దిగుబడి వస్తుందని మండల సహాయ అధికారి సంతోష్ మరియు సింధు పేర్కొన్నారు అల్లాపూర్ గుండె పల్లి గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు   వరిలో  దమ్ము చేయకుండా  నేరుగా విత్తి  వరి సాగు, డ్రం సీడర్ తో వరి విత్తు పద్ధతి, ద్వారా వరిని నాటాలని కోరారు భూమిలో ఉన్న  బాస్వరపు  ఎరువును  కరిగించే జీవ ఎరువు  ను ఉపయోగించే విధానం, పత్తి సాగులో యాజమాన్య పద్దతుల గురించి  వివరించడం వారు రైతులకు వివరించారు అల్లాపూర్ గ్రామంలో 3  రైతులు  వరిలో  దమ్ము చేయకుండా నేరుగా విత్తి  వరి సాగు  చేయడానికి ముందు కు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ అధికారులు సంతోష్ , మరియు సింధు తూప్రాన్ ఏడవ  వార్డ్ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, గుండె పల్లి సర్పంచ్ శ్రీ లతా రాజిరెడ్డి మనీ కృష్ణ నరసింహులు రైతుబంధు సమితి  కోఆర్డినేటర్  గోవర్ధన్, రైతులు పాల్గొన్నారు.