సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటుచేసుకోవాలి
ఆదిలాబాద్,మార్చి9(జనంసాక్షి): వానపాముల పెంపకం, వర్మి కంపోస్టుతో పంటలసాగు వల్ల లాభాలను ఆర్జించవచ్చని అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు తమ వ్యవసాయ విధానం మార్చుకోవాలని సూచించారు. దీనివల్ల వ్యవసాయం లాభసాటి ఉంటుంద్నారు ఇది పర్యావరణానికి కూడా ముఖ్యమని అన్నారు. కడెం మండలంలోని బెల్లాలలో రైతులు సాగుచేస్తున్న ఎర్రచందనం, శ్రీగంధం చెట్ల సాగును, వర్మీకంపోస్టు తయారీ, వానపాముల పెంపకం కేంద్రం, చిన్నబెల్లాలోగేదెల పెంపక కేంద్రాన్ని భైంసా మండల రైతులు పరిశీలించారు. ఎస్‌బీహెచ్ వారి గ్రావిూణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో దేగామకు చెందిన 36 మంది నిరుద్యోగ యువ రైతులకు పాడిపరిశ్రమ, గేదెల పెంపకంపై ఆరురోజుల శిక్షణనిచ్చారు. చివరిరోజు యువరైతులను కడెం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌లోని పట్టుపురుగుల పెంపకకేంద్రం, బెల్లాలలో పైకేంద్రాలను చూపించారు. ఎర్రచందనం, శ్రీగంధచం సాగు విధానాలను రైతులకు వివరించారు. పాడిగేదెల పెంపకం వ్యవసాయానికి ఏవిధంగా అనుబంధంగా లాభదాయకంగా మార్చుకోవచ్చో వివరించారు. అంతకుముందు బీరవెల్లి, సిర్గాపూర్‌లలోను రైతులకు డైరీ కేంద్రాలను చూపించినట్లు ఎస్‌బిహెచ్చ మేనేజరు తెలిపారు.