సైదాపూర్‌కి 170 యూనిట్లు మంజూరు
కరీంనగర్,ఫిబ్రవరి28(జనంసాక్షి): సైదాపూర్ మండలానికి 2014-15 సంవత్సరానికి గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా 170 యూనిట్లు మంజూరు అయినట్లు ఎంపీడీవో పద్మావతి తెలిపారు. 18-45 ఏళ్లలోని నిరుద్యోగ యువతీయువకులు మార్చి 2 నుంచి 5 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎస్సీ వర్గానికి 80, ఎ/-టసీకి 6, బీసీకి 84 యూనిట్లు మంజూరయినట్లు ఎంపీడీవో తెలిపారు. ఇదిలావుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే పోటీ పరీక్షలకు హాజరయ్యే విధానంపై కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ అధికారిణి మంజుల, ప్లేస్‌మెంట్ ట్రైనర్ మహేశ్‌కుమార్, ఐఏఎస్ స్టడీసర్కిల్ డైరెక్టర్ బాలకృష్ణ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.