సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన
సైబర్ కైం పోలీసు స్టేషన్‌ను ప్రారంభంలో డిజిపి
అమరావతి,ఆగస్ట్9(జనం సాక్షి): విజయవాడలో నిర్మాణం పూర్తయిన మొట్టమొదటి సైబర్ కైం పోలీసు స్టేషన్‌ను గురువారం డీజీపీ ఠాకూర్ లాంఛనంగా ప్రారంభించారు. వారం పది రోజుల్లో విశాఖలో కూడా సైబర్ కైమ్ర్ పోలీసు స్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. మూడు నాలుగు నెలల్లో కర్నూలు,అనంతపురం, విశాఖ, విజయవాడ, అమరావతి, రాజమండ్రి, తిరుపతి ఏడు పట్టణాల్లో సైబర్ ల్యాబ్‌లను ప్రారంభిస్తామని తెలిపారు. వీటిలో సైబర్ పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తారని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు, నగర సంయుక్త కమిషనర్ కాంతిరాణా, ఐపీఎస్ సంజయ్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ విూరా, వివిధ ¬దాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు తదితరులు హాజరయ్యారు.