సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-ఎస్సై రుక్మావార్ శంకర్
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్11(జనంసాక్షి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎస్సై రుక్మవార్ శంకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాదన్ కుర్తి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, కొన్ని రకాల సమాచారాన్ని పరిచయం లేని వ్యక్తులతో ఫోన్లో సంభాషించకూడదని ఒకవేళ అనుమానం వస్తే వెంటనే పోలీస్ శాఖకు గాని సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా మహిళలు వారి భద్రత విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వాహనదారులు సరైన పత్రాలతో వాహనాలను బయటకు తీయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై రామచంద్ర, హోమ్ గార్డ్ రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.