సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి-సిఐ వేణు గోపాల్ రెడ్డి

పటాన్చెరు జులై6 (జనం సాక్షి)
ఆధునిక సమాజంలో యువత ఆన్లైన్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఆదేశాలు మేరకు
బుధవారం నాడు పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు జిఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆన్లైన్ లో నేరాలు ఏవిదంగా జరుగుతున్నాయో వివరించారు. ఎవరైనా మేము బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాము మీ వ్యక్తిగత వివరాలు, ఓటిపి వంటివి చెప్పమని అడిగినా, మీకు లాటరి తగిలింది అని చెప్పినా, తక్కువ వడ్డీరేట్ల కు రుణాలు ఇస్తామని ఆశ చూపినా, మీ ఖాతా లో పొరపాటున డబ్బులు జమ చేసాము వాటిని తిరిగి పంపించమని అడిగినా ఎవరూ స్పందించ వద్దని సూచించారు.వాట్సాప్, ఫేస్ బుక్ ఇనిస్టాగ్రామ్ వంటి సామాజిక మద్యమాలలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు
 పలికారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, జిఎంఆర్ క్యాంప్ కమాండెంట్ గోపిశంకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.