సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాబిషేకం

కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పోంది సంవత్సరం పూర్తైన సందర్బంగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంది. సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌ నేతలు తమ అభిమానం చాటుకున్నారు. బిల్లు ఆమొదంలో ముఖ్యభూమిక పోషించి, రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతగా కరీంనగర్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు కర్ర రాజశేఖర్‌ గారి ఆధ్వర్యంలోఅమర వీరుల స్థూపం వద్ద సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. ఈ  కార్యక్రమానికి మాజీ ప్రభుత్వ విప్‌ ఆరెపెల్లి మోహన్‌  హాజరై తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించారు.  ఈసంర్భంగా ఆరెపెల్లి మోహన్‌ , కర్ర రాజశేఖర్‌ మాట్లాడుతూ, సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలను గుర్తించి, రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు.  చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, తెలంగాణ ప్రజల మనస్సులో ఒక దేవతగా ముద్రవేసుకున్నారని అన్నారు.  ఈరోజును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని గుర్తచేశారు. ఈసమావేశంలో గందె మాధవి మహేష్‌, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనవాస్‌, దిండిగాల మధు, వి.గణెళిష్‌బాబు, ఎలగందుల మల్లేశం, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ముస్తాక్‌, పడాల శంకరయ్య గౌడ్‌, వేల్పుల వెంకటేశ్‌, వీరబోయిన కుమార్‌యాదవ్‌, వెన్న రాజమల్లయ్య, దన్నాయక్‌ దామోదర్‌రావు, బొబ్బిలి విక్టర్‌, గడ్డం విలాస్‌రెడ్డి, ధరణికోట దామోదర్‌, ఆకుల ప్రకాష్‌, మాదాసు శ్రీనివాస్‌, మూల జైపాల్‌, మడుపు మోహన్‌, బొమ్మ ఈశ్వర్‌గౌడ్‌, బాసెట్టి కిషన్‌, జక్కని ఉమాపతి, ఫజల్‌, మదన్‌రెడ్డి, పోన్నం మధు, పడాల రాహూల్‌, తునికి బాలరాజ్‌, డి.నర్సింగరావు, శ్రావణ్‌, నదీం, సన్ని హెడ్వర్డ్‌, మగ్దుం అలి, ఖలీమొద్దిన్‌, దన్నుసింగ్‌, నాగుల సతీష్‌, జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.