సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
నెల్లూరు,నవంబర్26 (జనంసాక్షి): జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయానికి ఇన్ ప్లో 51,178 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ప్లో 51,578 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.88 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 68.34 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సోమశిల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. ఇకపోతేకర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ప్లో 41,628 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ప్లో 12,833 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 867అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 114.9952 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలివేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 867 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 129.7760 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.