*స్కూల్ విద్యార్థులకు బరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై అవగాహన కార్యక్రమం*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్1 (జనం సాక్షి);

జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు బరోసా సెంటర్ సిబ్బంది గద్వాల పట్టణము నల్ల కుంట లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు బరోసా సెంటర్ అందిస్తున్న సేవల గురించి, మొబైల్ వినియోగం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చదువు ప్రాముఖ్యత గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, అత్యవర సమయంలో వినియోగించుకోవాల్సిన డయల్-100, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, బరోసా సెంటర్ మొబైల్ 6303923257 ప్రాముఖ్యత గురించి , బాధిత మహిళలకు బరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ద్యేశించి వారు మాట్లాడుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లను ఎల గుర్తించాలో వివరించారు. ఎవరైన విద్యార్థులను బ్యాడ్ టచ్ చేనట్లు అయితే వెంటనే తల్లి తండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు ఇంట , బయట ఎలాంటి లైంగిక వేదింపులకు గురైన వెంటనే బరోసా సెంటర్ మొబైల్ 6303923257 కు తెలియజేయాలని సూచిస్తూ పొక్సొ యాక్ట్ గురించి వివరించారు. విద్యార్థులు చదువు పై దృష్టి పెట్టాలని , ఉపాధ్యాయుల సూచనలూ పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహంచాలని అన్నారు. వీలైనంత వరకు స్కూల్ దశలో మొబైల్ లకు దూరంగా వుండాలని, తప్పని సరి పరిస్థితుల్లో మొబైల్ ను వినియోగిoచాల్సి వస్తే సైబర్ నేరాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలిపారు . అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ -100, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వినియోగం గురించి తెలియజేశారు.యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని ఎవరైనా గుట్కాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసువారికి తెలపాలని, బాల్య వివాహాలు చేయడo వల్ల మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, జరిగే నష్టాల గురించి తెలియజేశారు. విద్యార్థినీ లు వేధింపులకు గురైతే పోలీస్ షీ టీం నెం 8712670312 కు ఫోన్ కాల్ లేదా వాట్సప్ మెస్సేజ్ ద్వారా సమాచారం అందిస్తే వేధింపులకు గురి చేసే వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని,సమాచారం అందించిన వారి వివరాలను గోప్యoగా ఉంచుతారనీ అన్నారు. బాధిత మహిళలకు బరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బరోసా సిబ్బంది శ్వేతా , కవిత , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్యుత్ రెడ్డి, ఉపాద్యాయులు స్పందన, అరుణ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు