స్త్రీలపై అత్యాచార ఘటనలపై కమిటీ
సిపిఎం మధు డిమాండ్
అనంతపురం,ఆగస్ట్18(జనం సాక్షి): ఆడపిల్లలు, మహిళలు సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. దేశం, రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై వెంటనే అత్యున్నత విచారణ కమిటీ లను వేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి. బాలికలు, మహిళల సంరక్షణ కోసం సీపీఎం, సీపీఐ ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యామ్నాయనీతోనే సమాజాభివృద్ది జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.అనంతరం సదస్సులో పాల్గొన్న మహిళ నాయకులు, వక్తలు మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర నాయకులు రమాదేవి, తెలంగాణ రాష్ట్ర నాయకులు దుర్గా భవాని, మహిళా సమాఖ్య నాయకులు జయలక్ష్మమ్మ, సీపీఐ రాష్ట్ర నాయకులు వనజ, ప్రముఖ కవి సింగమనేని నారాయణ సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శి లు రాంభూపాల్, జగదీష్, ఐద్వా సావిత్రి, /ఖలూబ నల్లప్ప, రచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ సాహితీ విమర్శకులు పాల్గొన్నారు.
—————–