స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో మునుగోడు బహిరంగ సభకు బయలుదేరిన మండల టిఆర్ఎస్ నాయకులు

మోమిన్ పేట ఆగస్టు 20( జనం సాక్షి)
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మునుగోడు ముఖ్యమంత్రి  కెసిఆర్ బహిరంగ సభకు మోమిన్ పేట మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు మోమిన్ పేట నుండి నల్గొండ జిల్లా మునుగోడు వరకు 200 కార్లలో కార్యకర్తలు బయలుదేరి వెళ్లాడు బయలుదేరిన వారిలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరిశంకర్ మండల ఎంపిటిసి ల సంగం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు డబ్బాని వెంకట్ ఎంపీపీ వసంత వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు