స్పేస్‌ స్టేషన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం

ఎప్పుడైనా కూలవచ్చని హెచ్చరించిన రష్యా
మాస్కో,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఈ నిర్ణయం తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌) పరిశోధనలపై ప్రభావం చూపుతుందని రష్యా అభిప్రాయపడిరది. ఇదే జరిగితే, 500 టన్నుల బరువున్న స్పేస్‌ స్టేషన్‌ భారత్‌ లేదా చైనాలో పడే అవకాశాలుంటాయని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్‌ డిమిట్రీ రోగోజిన్‌ అన్నారు. రష్యాపై అమెరికా విధించే ఆంక్షలు ఐఎస్‌ఎస్‌ పరిశోధనలపై ప్రభావం చూపుతాయి. పరిశోధనలకు రష్యా దూరంగా ఉంటే స్పేస్‌ స్టేషన్‌ అనియంత్రిత కక్ష్యలో తిరగకుండా ఎవరు అడ్డుకుంటారని అన్నారు. అమెరికా లేదా యూరప్‌లో పడకుండా ఎవరు రక్షిస్తారని అన్నారు. స్పేస్‌ స్టేషన్‌ ఇండియా లేదా చైనాలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అంశంపై ఆ రెండు దేశాలను బెదిరించాలా? ఐఎస్‌ఎస్‌ రష్యా విూదుగా మాత్రం వెళ్లదు. కాబట్టి, ఏదైనా నష్టం జరిగితే అది విూకే అంటూ అమెరికాను డిమిట్రీ హెచ్చరించారు. అమెరికా, రష్యా, కెనడా, యూరప్‌, జపాన్‌ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో ’ఐఎస్‌ఎస్‌’ పనిచేస్తోంది.