స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన రాంచరణ్ * విద్యార్థికి ఎస్సై గణేష్ అభినందన
జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి:
మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న మందరికల రాంచరణ్ కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశం కోసం సీట్ సాధించాడు. ప్రవేశ పోటీ పరీక్షలో ప్రతిభను కనబరచి మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించడం పట్ల ఎస్సై గణేష్ విద్యార్థి రాంచరణ్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ లో మారుమూల పల్లెల్లో ఉన్న విద్యార్థులు సీట్లు సాధించటం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్న సాయి ఎక్సలెంట్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్బంగా సాయి ఎక్సలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గురుకులంలో 80 మందికి నవోదయ పాఠశాలలో ముగ్గురు, స్పోర్ట్స్ స్కూల్ లో ఒక విద్యార్థి సీట్లు సాధించడం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధులకు ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై తిరుపతిరావు మాజీ సర్పంచ్ వాంకుడోత్ వెంకన్న, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.