స్లెడ్జింగ్ ఆటలో భాగమే: పాంటింగ్

ముంబై : క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఇప్పుడు సాధారణమై పోయిందని, అయితే హద్దులు దాటకుండా ఆటగాళ్లు చూసుకోవాలని ముంబై ఇండియన్స్ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ సూచించాడు. ‘స్లెడ్జింగ్ ఆటలో భాగమేనని నమ్ముతాను. అయితే ఆటగాళ్లు హద్దు మీరకుండా ఉండాలి. ఇప్పుడు మా ఆటగాళ్లకు కూడా నేను అదే చెబుతాను. అయితే ప్రపంచకప్‌లో ఏం జరిగిందనేది అప్రస్తుతం. లీగ్‌లో మా ఆటగాళ్ల ప్రవర్తనతో పాటు ఏ రీతిన ముందకెళ్లాలనే దానిపైనే మా దృష్టి ఉంది’ అని పాంటింగ్ అన్నాడు.