స్వతంత్ర భారత వజ్రోత్సవాలా సందర్భంగా 17వ తేదీ రక్తదాన నేడు రక్తదాన శిబిరాలు
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
శిబిరాలను భువనగిరి మరియు ఆలేరు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.
భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలో, ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో (75) మందికి తక్కువ కాకుండా రక్త దాన కార్యక్రమానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు, ప్రజ ప్రతినిధులు హాజరు అవుతారని ఆమె తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున్ మాట్లాడుతూ రేపు నిర్వహించే రక్త దాన శిబిర కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసిన్నట్లు , సంబందిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన్నట్లు ఆయన తెలిపారు