స్వతంత్ర భారత వజ్రోత్సవ “ఫ్రీడం రన్”
జూలూరుపాడు, ఆగష్టు 11, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎంపీడీవో కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడం రన్ నిర్వహించి, భారత మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్యా సోని, తహశీల్దార్ లూధర్ విల్సన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు, వైద్యాధికారి శ్రీధర్, పశు సంవర్ధకశాఖ వైద్యాధికారి బద్దూలాల్, ఎస్సై గణేష్, ఎంఈవో వెంకట్, ఐకెపి ఎపిఎం సత్యనారాయణ రాజు, ఈజీఎస్ ఏపీవో సుహాసిని, సిసిలు బండ్ల మధుసూదనరావు, ధారావత్ నాగేశ్వరరావు, రామారావు, ఏఈవో గౌస్, గ్రామ పంచాయతీ సర్పంచులు గుండెపిన్ని విజయ, లకావత్ భారతి, గలిగె సావిత్రి, బానోతు నరసింహారావు, బానోతు శాంతిలాల్, భూక్యా రాములు, ముక్తి నర్శింహారావు, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.