స్వయంగా ఇంటింటికి తిరిగి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
జులై 15 జనం సాక్షి /మండల వ్యాప్తంగా గత వారం రోజులుగా పడుతున్న బారి వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రాకూడదని ప్రజల వద్దకే కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల ను శుక్రవారం మండల కేంద్రంలో మరియు కేసముద్రం (విలేజ్),ఉప్పరపల్లి,కల్వల గ్రామాలలోఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ స్వయంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాష్ట్రంలోని పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తుందని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా ఆదుకుంటున్నదని తెలిపారు.గతంలో రూ 51000/-లు, 75116/-ఉన్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివాహ కానుకను రూ1,00,116/-లు కు పెంచడం జరిగింది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఒలం చంద్రమోహన్ , వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,మండల అధ్యక్ష కార్యదర్శులు నజీర్ అహ్మద్,కమటం శ్రీనివాస్, ఎన్నమాల ప్రభాకర్,వీరు నాయక్ ,నీలం దుర్గేష్ ,ఆగే వెంకన్న,సట్ల శ్రీను,తెరాస పార్టీ ముఖ్యనాయకులు,వివిధ గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,గ్రామ తెరాస నాయకులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.