స్వామి వివేకానంద బోధనలు స్మరణీయం
ఆదిలాబాద్, నవంబర్ 26 : స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన బోధనలను గ్రామగ్రామానికి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు దేవేందర్ తెలిపారు. వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే జనవరి 12 నుండి ఏడాదిపాటు వేడుకలను నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. దేశ పునర్‌నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలను మరింత భాగస్వామ్యంచేయడం వల్ల ప్రపంచంలోనే మన దేశం అత్యంత శక్తివంతమైన దేశంగా అవుతుందని అన్నారు. వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని దేవేంధర్ తెలిపారు.