హత్య కేసును ఛేదించిన ఇల్లందు పోలీస్ బృందం..పోలీసు వారి అదుపులో నిందితులు..

హత్య కేసును ఛేదించిన ఇల్లందు పోలీస్ బృందం..పోలీసు వారి అదుపులో నిందితులు..

ఇల్లందు సెప్టెంబర్ 23 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ సమీప బొజ్జయిగూడెంలో జరిగిన హత్యకు కారకులైన నిందితులను పట్టుకున్న విషయాన్ని ఇల్లందు డిఎస్పి ఎస్వి రమణమూర్తి, సిఐ టి కరుణాకర్ వెల్లడించారు. ఈనెల సెప్టెంబర్ 19 నాడు బొజ్జయిగూడెంలోని సమీపంలో ఉన్న జామాయిల్ తోటలో మారుతి శ్రీనివాసుని హత్య చేసిన నిందితులను పట్టుకొని ఇల్లందు స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ.. మారుతి శ్రీనివాస్ పై ఉన్నపాత కక్షలను మనసులో ఉంచుకొని తనను ఎలాగైనా హత్య చేయాలి అనే నేపంతో లారీ క్లీనర్ అయినటువంటి రోహిత్, నరేందర్, వెంకటేష్లు మద్యం సేవించి కాపలా కాశి ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీనివాస్ని హత్య చేసి ఆ మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లారు. మృతుడి సెల్ఫోనీ తీసుకొని మల్లేష్ నరేష్ లకు ఇచ్చి ఆ తరువాత నిందితులు అదే సెల్ ఫోను మరలా తీసుకెళ్లారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురి విషయం తెలుసుకొని, ఫోన్ తీసుకొని మళ్లీ ఇచ్చిన వారిని పారిపోయేందుకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు బుక్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ టి కర్ణాకర్ తో పాటు ఇల్లందు పోలీస్ బృందం కూడా పాల్గొన్నారు.