హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాసుల బాల్ రాజ్.


కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-ఏఐసీసీ పిలుపు మేరకు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హత్ సే హత్ జోడో యాత్రను బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ గద్దే వద్ద జెండను ఆవిష్కరించి యాత్రను ప్రారంభించా రు.ఈ యాత్ర కోటగిరి చౌరస్తా నుండి మొదలుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గడపగడపకు తిరుగుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండ గడుతూ ఈ పాదయాత్ర కొనసాగింది.ఈ యాత్రను ఉద్దేశించి కాసుల బాల్ రాజ్ మాట్లాడుతూ. తెలంగాణకు శ్రీరామరక్ష తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యాలను ప్రతి గడపగడపకు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఇందిరమ్మ పాలనలో బడ్గు,బలహీన వర్గాల అభ్యునతికి కొనసాగిన సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే అమలు పరుస్తామని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల హయాంలో ఏర్పడిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఒకేదఫలో రెండు లక్షల రుణమాఫినీ చేసి తెలంగాణ రైతాంగాని కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నా రు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెల్పించలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు.ఈ యాత్రలో కామారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు హన్మండ్లు,నిజమాబాద్ జిల్లా  ప్రధాన  కార్యదర్శిలు కొట్టం మనోహర్, హన్మంత్,మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, బాన్సువాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్, చందూర్ ఎంపీపీ లావణ్య రాంరెడ్డి,కోటగిరి పట్టణ అధ్యక్షులు అయుబ్,వహీద్,వార్డ్ మెంబర్ ఫతే, వేణు,ఆనంద్,అబ్బయ్య,మొయినొద్దీన్,జుబేర్, ఉషం భుమ్మన్న,బాన్సు వాడ  మండల ఉపాధ్యక్షులు దర్జీ  జీవన్,బషీర్ ఖాన్,యాదుల్,విట్టల్ రెడ్డి,వెంకన్న యాదవ్,వెంకట్ రెడ్డి,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.