హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
గుడిహత్నూర్: జులై 21( జనం సాక్షి)హరితహారంలో మొక్కలు నాటి వంద శాతం సంరక్షించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ సమీపంలో ఉట్నూర్ వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు పక్కన కలెక్టర్ మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు ఎండిపోతే వాటి స్థానం లో వెంటనే కొత్త మొక్కలు నాటాలన్నారు. వాటికి తప్పనిసరిగా కం చెలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల కిరువైపులా మూడు వరుసలతో మొక్కలు నాటాలని, ఉపాధిహామీ పనులలో భాగంగా రోడ్లకిరువైపులా ముళ్లపొదలను, చెత్త కుప్పలను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు
హరితహారం లక్ష్యం చేరుకోవాలంటే పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా తీసుకొని సక్రమంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, డిఆర్డీఏ పిడి కిషన్, ఏపీడి రాజేశ్వర్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ సునీత, గుడిహత్నూర్ సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీటీసీ లు అంకతి సవిత, కోవ తులసి, ఎంపిఓ లింగయ్య, ఏపీఓ సుభాషిణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు