హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు
నర్సరీల్లో పెరగుతున్న లక్షల మొక్కలు
మరిన్ని చోట్ల నాటేందుకు సన్నాహాలు
హైదరాబాద్,ఆగస్ట్10(జనం సాక్షి): హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాలని సోషల్ ఫారెస్ట్, ఈజీఎస్ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. మానవజాతి మనుడగకు చెట్లు సజీవసాక్ష్యం. వృక్షాలు అంతరించడం వల్లనే సరైన వర్షాలు కురువడం లేదని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతేడాది వరుణ దేవుడు కరుణించడంతో నాటిన మొక్కలు జీవం పోసుకున్నాయి. ఇందులో భాగంగానే ఫారెస్ట్ నర్సరీలో లక్షల్లో వివిధ రకాల మొక్కల పెంపకం, అలాగే ఈజీఎస్ కింద వివిధ రకాల మొక్కలను పెంచి పోషిస్తున్నారు. వీటిని జులై మాసంలో గ్రామాల వారీగా పంపిణీ చేసి, అందరిచేత మొక్కలు నాటించారు. అయితే వర్షాభావం వల్ల ఇంకా కొన్నిచోట్ల నాటేందుకు కుదరలేదు దీనిని త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేయనున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశాభావంతో హరితహారాన్ని ఒక మహోత్తర ఉద్యమంగా ముందుకు తీసుకుని వెళ్లి పూర్తి చేస్తున్నారు. మొక్కలు నాటించి ఈజీఎస్ కూలీల ద్వారా నాటిన మొక్కల చుట్టూ రక్షణ కంచెలు సైతం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత హరితహారంలో పాఠశాల, ప్రభుత్వ దవాఖాన, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరు పడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ శాఖల ఆధ్వర్యంలో పండ్లు, పూలు, అటవీ, మిశ్రమ జాతి మొక్కలతో ఇతర మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వన విభాగం కింద ఒకటి, జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ఆధ్వర్యంలో నర్సరీలను నెలకొల్పి మొక్కల పెంపకం చేపట్టారు. ఈ నర్సరీల్లో పండ్ల విభాగంలో జామ, ఉసిరి, నిమ్మ, బొప్పాయి, కర్జూరా, ఫ్లవరింగ్, సాధారణ మొక్కలు కానుగ, చింత, నీలగిరి, కుంకుడు, వెదురు, వంటి మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలకు నీరుపట్టి బతికించేందుకు సంబంధిత అధికారులు చొరవ తీసుకుంటూ, ఆయా నర్సరీ బాధ్యులకు ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూ, వాటిని సందర్శిస్తూ, మొక్కల ఎదుగుదల తీరును పరిశీలిస్తున్నారు.