హర్యానాలోనూ వాయుకాలుష్యం..


` 17 వరకు పాఠశాలలు మూసివేత
న్యూఢల్లీి,నవంబరు 14(జనంసాక్షి):తీవ్రమైన వాయుకాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఢల్లీి ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. తాజాగా హర్యానా ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, సోనేపట్‌, రaజ్జర్‌ జిల్లాల్లోని పాఠశాలలను ఈ నెల 17 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌సీఆర్‌లో అన్ని నగరాల్లో అన్ని రకాల నిర్మాణ పనులను సైతం ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.జిల్లాల్లో నిర్మాణ కార్యకలాపాలు, చెత్తను కాల్చడం మరియు మునిసిపల్‌ సంస్థలు వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించింది. హర్యానా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ రోడ్లపై దుమ్మును నియంత్రించేందుకు స్వీపింగ్‌ను నిలిపివేయాలని, నీటిని చల్లాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది ఇండ్ల నుంచే పని చేయాలని సూచించింది. రోడ్లపై వాహనాల సంఖ్యను 30 శాతానికి తగ్గించాలని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా నిర్దేశించుకున్నది.తీవ్రమైన వాయుకాలుష్యం నేపథ్యంలో ఢల్లీిలో ఇప్పటికే నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేయగా.. వర్చువల్‌ విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నెల 17 వరకు గాలులు వీస్తాయని, దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి పొగ ఢల్లీిలోకి ప్రవేశిస్తుందని కాలుష్యాన్ని పర్యవేక్షించే సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చించగా.. నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి మరింత దారుణంగా మారితే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.సుప్రీం కోర్టు సూచన మేరకు ఢల్లీిలో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఢల్లీి సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తున్నామని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించడం లేదని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి సుప్రీం కోర్టు ముందుంచుతామని, కేంద్రంతో పాటు అన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సీపీబీసీతో సహా పలు ఏజెన్సీ నివేదికలను పరగణిలోకి తీసుకొని తీవ్ర పరిస్థితులు ఎదురైతే ఢల్లీిలో అన్ని ప్రైవేటు వాహనాలు, నిర్మాణాలు, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.