హర్‌ ఘర్‌ తిరంగా

ఇంటిపై జెండా ఎగురేయండి: మోడీ

న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): భారత్‌కు స్వాతంత్యర్ర వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం
చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ’హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ట్విట్టర్‌లో షేర్‌చేశారు.