హలో బహుజన చలో మునుగోడు
-బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు యల్ విజయ్ కాంత్
కురవి సెప్టెంబర్-20
(జనం సాక్షి న్యూస్)
హలో బహుజన చలో మునుగోడు అని బిఎస్పి పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యల్ విజయ్ కాంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గం అడ్డాను బహుజనల అడ్డాగా మార్చడమే ద్యేయంగా మంగళవారం బిఎస్సీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రధసారధిగా నిర్వహిస్తున్న బహుజనులకు రాజ్యాధికార యాత్ర 300 రోజులు కార్యక్రమం మొదటి విడత దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు రెండవ విడత ప్రారంభం చేయబోతున్న సందర్బంగా డోర్నకల్ నియోజకవర్గం నుండి పలు వాహనాలల్లో తరలి వెళ్లడం జరిగింది.మునుగోడు ఉప ఎన్నికల్లలో బీఎస్పీ బిసి అభ్యర్థిని ఉపఎన్నిక పోటీ లో పెడుతున్నామని బిఎస్పి గెలుపే లక్షంగా సత్తా చాటుతామని ఆయన తెలిపారు. మునుగోడు గడ్డ బహుజనుల అడ్డా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లగా మంచి ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు హైదరాబాద్ నుండి 1000 కార్ల కాన్వాయ్ తో బయలు దేరి అందోల్ మైసమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ గ వచ్చి మునుగోడు లో బహిరంగ సభ లో పాల్గొంటారు అని, నెల రోజులు మునుగోడు లోనే యాత్ర నిర్వహించి ప్రతీ ఓటర్ ను కలిసి బిఎస్పి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. మునుగోడు కు వెళ్లినవారిలో జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్నఆర్గనై్జింగ్ కార్యదర్శి ఐతం ఉపేందర్,జిల్లా కార్యదర్శి ఐనలా పర్శరాములు,జిల్లా ఈసి మెంబర్ ఎడ్ల శ్రీను, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు గుండె రామనర్సయ్య, కార్యదర్శి తగరం శ్రీరామ్, ట్రెషరర్ బాసిపంగు మహేందర్,నాయకులు ప్రవీణ్, బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.