హావిూలను అమలు చేస్తున్నాం: ఎమ్మెల్సీ
కాకినాడ,సెప్టెంబర్3(జనం సాక్షి): ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధే టిడిపి లక్ష్యమని శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆలమూరు మండల కేంద్రంలోని దళితవాడలో రూ.7 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని సోమవారం రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హావిూలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని ఇందుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.ధనలక్ష్మి, జెడ్పిటిసి సభ్యులు దండంగి మమత, ఎఎంసి చైర్మన్ ఈదల నల్లబాబు, సొసైటీ అధ్యక్షులు వంటిపల్లి సతీష్ కుమార్, ఎంపిడివో ఎంవి రమణారావు, ఈవో పీఆర్డీ పి.బజ్జిరాజు, సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షులు కొత్తూరి వీరన్నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు సిద్దిరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు వంటిపల్లి పాపారావు, సలాది నాగేశ్వరరావు, రాయుడు సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.