హావిూలను మోదీ గంగలో కలిపేశారు


– హోదా ఇవ్వద్దని.. 14వ ఆర్థిక సంఘం చెప్పిందా?
– ఆధారాలుంటే చూపాలి
– కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ తోట నర్సింహం
– రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆంధప్రదేశ్‌కు ఇచ్చిన హావిూలను గంగలో కలిపేశారని టీడీపీ లోక్‌సభ సభ్యుడు తోట నరసింహం ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన తోట.. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని నిలదీశారు. రాష్ట్ర విభజన
జరిగినప్పుడు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని గుర్తుచేశారు.  2014 ఆంధప్రదేశ్‌ విభజన చట్టంలో ప్రత్యేక ¬దా అంశాన్ని నరేంద్ర మోదీ అనుచరులతో మాట్లాడిన తరవాతే పార్లమెంట్‌లో ప్రస్తావించానని నిన్న రాజ్యసభలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ స్పందించడంలేదన్నారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తిగా నేడు లోక్‌సభ, రాజ్యసభల్లో చట్టాలను రూపొందించుకుంటున్నామని, ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్ట సభల్లో ఉన్న మనవిూద ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పని చేయకుండా ఆంధప్రదేశ్‌ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలను ఎక్కడా ప్రస్తావించడంలేదు అంటూ తోట కేంద్రం తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక ¬దా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడానికి ఆధారాలు చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ తోట నర్సింహాం డిమాండ్‌ చేశారు. ¬దా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడానికి ఆధారాలు చూపాలని అన్నారు. చట్ట సభలో నాటి ప్రధాని ఇచ్చిన హావిూలు ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం చేసిన విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ¬దా విషయం కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిన్న రాజ్యసభలో ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ సభలో రాజకీయ ఉపన్యాసం చేశారే తప్ప.. ఏపీ గురించి ఏవిూ మాట్లాడలేదని తోట నర్శింహం విమర్శించారు. కేవలం అబద్దాలతో ఏపీ ప్రజలను మోసం చేసే విధంగా కేంద్రం విధాలు ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన..
విభజన చట్టంలోని హావిూలను అమలు చేయాలని, ప్రత్యేక మోదాను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా ఎంపీలు బుధవారం పార్లమెంట్‌ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్రం ఏపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, విభజన చట్టంలోని హావిూలను పరిష్కరించాల్సింది పోయి అన్నీ చేశామంటూ అసత్యాలు వెల్లడిస్తుందని టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా ఇచ్చే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి’ వేషధారణలో ఎంపీ శివప్రసాద్‌..
ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సాధన కోసం వివిధ వేషధారణలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ బుధవారం కూడా అదే రీతిలో నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి వేషధారణలో ఎంపీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ‘సై..రా నర్సింహారెడ్డి….నీ పేరే బంగారుకడ్డీ.. నీవేమో పదునైన కత్తి’ అంటూ పాట పాడతూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు.