హాస్టల్‌ విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలి

అనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): హాస్టల్‌లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్తి విభాగం కోరింది. ఈ మేరకు హిందూపురంలో ఎమ్‌ఆర్‌వోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హాస్టల్‌ విద్యార్థులకు ఆరు నెలలుగా పెండింగ్‌ లో ఉన్నటువంటి కాస్మెటిక్‌ చార్జీలను విడుదల చేయాని కొరడం జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 219 ప్రభుత్వ హాస్టల్‌ ఉన్నాయి. ఈ హాస్టల్‌ లో దాదాపుగా 26వేలమంది విద్యార్థులు వున్నారు. వీరికి ఆరు నెలలుగా విద్యార్థులకు కాస్మొటిక్‌ ఛార్జీలు 2.6కోట్లు వారుకు పెండింగ్‌ లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కాస్మొటిక్‌ చార్జీలను విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తోంది. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హాస్టల్‌ లో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్మొటిక్‌ ఛార్జీలు విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకుల జయచంద్ర, జగన్‌, మధు, మహేష్‌ , ప్రేమకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.