హిందీలో చెప్పినా ప్రధానికి పట్టింపు లేదు
విభజన హావిూలను విస్మరించిన మోడీ
వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలుగుదెబ్బ చూపాలి
చంద్రబాబును విమర్శించే వారు కేంద్రాన్ని ఎందుకు పట్టించుకోరు
ఒంగోలు సభలో నిలదీసిన ఎంపి రామ్మోహన్ నాయుడు
ఒంగోలు,జూలై28(జనం సాక్షి ): రాష్ట్ర విభజన చట్టంలో హావిూలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. మనం తెలుగులో చెబితే అర్థం కాదని హిందీలో మాట్లాడినా ప్రధాని మన సమస్యలను పెడచెవిన పెట్టారని అన్నారు. ఇటీవల తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఏపీ ప్రజల గొంతును విన్పించే అవకాశం తనకు వచ్చిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. లోక్‌సభలో ప్రసంగించిన తనను అభినందించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. విభజన చట్టంలోని హావిూలపై తెదేపా చేపట్టిన ధర్మపోరాట సభ ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను లోక్‌సభలో హిందీలో మాట్లాడేందుకు కారణాన్ని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి హిందీ ఇష్టమైన భాష అని, మనం తెలుగులో మాట్లాడుతున్నా.. ఆంగ్లంలో మాట్లాడుతున్నా ఆయనకు మన రాష్ట్ర సమస్యలు అర్థం కావట్లేదేమో అనుకొని తాను హిందీలోనే మాట్లాడి కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేశానన్నారు. ఎక్కడ
అన్యాయం జరిగిందో ప్రశ్నల రూపంలో ఆయన ముందుంచానని, కానీ, అనంతరం మాట్లాడిన ప్రధాని మాత్రం ఏపీ గురించి మాట్లాడేలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏవిూ చేయలేదు కాబట్టే ఆయన ఏపీ గురించి మాట్లాడలేదని, ఒకవేళ మాట్లాడితే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయోననే భయంతోనే వాస్తవాలు మాట్లాడకుండా లోక్‌సభలో రాజకీయాలు చేశారని విమర్శించారు. వైకాపా ఉచ్చులో తెదేపా పడిందని ప్రధాని అంటున్నారని, కానీ వారి ఉచ్చులో పడింది భాజపావారేనని ప్రజలే తేల్చే రోజులు వచ్చాయన్నారు. ప్రత్యేక ¬దా ఉద్యమాన్ని యథావిధిగా కొనసాగించి సాధిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే ప్రధాని చెప్పిన మాటను మనం వినడం కాకుండా మన తెలుగు ప్రజలు చెప్పేలా వారే వినే రోజులు భవిష్యత్తులో వస్తాయని ప్రజలు నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నాయని, ఆయనేం తప్పు చేశారని నిలదీశారు. 69 ఏళ్ల వయసులో కూడా కుటుంబాన్ని పక్కనబెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నందుకా ఆయన్ను విమర్శిస్తున్నారు అని ప్రశ్నించారు. విభజన హావిూలు అమలుచేయని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు వారికి దమ్ములేదన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని, లాలూచీ పడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానిని నిలదీసి రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు.